Share News

DK Shivakumar: ఏదీ కోరను, తొందరపడను... డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 03:51 PM

సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.

DK Shivakumar: ఏదీ కోరను, తొందరపడను... డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు వ్యవహారం ముదురుతోంది. అధికార పంపిణీ వ్యవహారంపై తలెత్తిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకూమార్‌ (DK Shivakuamar)ను ఆయన నివాసంలో ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన ఆధ్యాత్మిక నేత నంజవదూత స్వామి శుక్రవారంనాడు కలుసుకున్నారు. డీకేకు తమ మద్దతు ప్రకటించారు. దీనిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీనే తన కమ్యూనిటీ అని, రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలను తాను సమంగా చూస్తానని చెప్పారు.


నాయకత్వ మార్పుపై అడిగినప్పుడు 'నేను ఏదీ కోరను. దేనికీ తొందరపడేది కూడా లేదు. దీనిపై మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎప్పుడూ కమ్యూనిటీ కోణం నుంచి చూడను. కాంగ్రెస్ పార్టీనే నా కమ్యూనిటీ. సమాజంలోని అన్ని వర్గాలను అభిమానిస్తుంటాను' అని డీకే సమాధానమిచ్చారు.


సీఎం పోస్టు వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు తాను ఢిల్లీ వెళ్తానని చెప్పారు. 'ఢిల్లీకి తప్పనిసరిగా వెళ్తాను. అది మా గుడి. కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. మాకు ఢిల్లీ నుంచే ఎల్లప్పుడూ మార్గదర్శకాలు ఉంటాయి. ఢిల్లీలో నాకు చాలా పని ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక ప్రాజెక్టులకు ముందుకు తీసుకు వెళ్లేందుకు పార్లమెంటు సభ్యులను నేను కలవాల్సి ఉంది. మా ముఖ్యమంత్రి కూడా సమస్యలను కేంద్రంతో మాట్లాడుతున్నారు. కేంద్రం రైతులను ఆదుకోవడం లేదు' అని తెలిపారు.


ఊహాగానాలను తోసిపుచ్చిన ప్రియాంక్ ఖర్గే

రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చనే ఊహాగానాలను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తోసిపుచ్చారు. దీనికి ముందు ఆయన డీకే శివకుమార్‌ను కలుసుకున్నారు. పాలనాపరమైన సమస్య కారణంగానే తాను డీకేను కలిసినట్టు ప్రియాంక్ ఖర్గే చెప్పారు. సీఎంను కూడా కలుస్తానని అన్నారు. ఏ నిర్ణయమైన అధిష్ఠానం తీసుకుంటుందని, అధిష్ఠానం పిలిచినప్పుడు తాము వెళ్తామని సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పటికే చెప్పినందున మీడియా కూడా ఊహాగానాలకు చేయరాదని కోరారు. బీజేపీనే ఈ ఊహాగానాలకు సృష్టిస్తోందని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ

ఢిల్లీ పొల్యూషన్‌.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 28 , 2025 | 03:52 PM