DGCA: ఆ ముగ్గురినీ వెంటనే ఉద్యోగంలోంచి తీసేయండి.. ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశం..
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:57 PM
Air India plane crash: జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యల కింది విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.

DGCA orders staff removal Air India: అహ్మదాబాద్ (Ahmadabad)లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది షెడ్యూల్, రోస్టరింగ్‌లో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎయిరిండియా(Air India)లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది.
జూన్ 20న జారీ చేసిన ఉత్తర్వుల్లో సంబంధిత అధికారులపై తక్షణమే అంతర్గత క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించాలని టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కోరింది. ఈ ముగ్గురు అధికారులలో ఎయిర్‌లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు సమాచారం.
జూన్ 12న 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం.. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొద్దిక్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానసిబ్బంది, ప్రయాణీకుల్లో కేవలం ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడం వల్ల అకారణంగా వైద్యవిద్యార్థులు, స్థానికులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘోర విషాదంలో మొత్తం 272 మంది మరణించారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానాల పనితీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
దర్యాప్తులో భాగంగా DGCA ఎయిర్‌లైన్ అకౌంటబుల్ మేనేజర్‌కు షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్పాట్ చెక్‌లో విమాన సిబ్బంది విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడైందని పేర్కొంది. ఈ ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఏడు రోజుల్లోపు వివరించాలని ఏవియేషన్ వాచ్‌డాగ్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం
వరుసగా 51 పుష్ అప్స్.. జనాలను సర్‌ప్రైజ్ చేసిన తమిళనాడు గవర్నర్
Read Latest Telangana News and National News