Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:10 PM
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటి అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

చెన్నై: మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటీ అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు మంగళవారం రాత్రి ఆళ్వార్‌పేటలోని ఎంఎన్‌ఎం కార్యాలయానికి వెళ్లి కమల్‌తో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కమల్‌తో సమావేశమైనట్లు డిప్యూటీ సీఎం ఉదయనిధి తన ఎక్స్‌పేజీలో పోస్ట్ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ శపథం.. ఆ కార్యాలయాన్ని కూల్చేదాకా వుంటా
తాను కమల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని, ఆయన తనను సాదరంగా ఆహ్వానించారని, సినిమా, రాజకీయ రంగాలపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా డీఎంకే కూటమి తరఫున కమల్‌హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైనట్లు స్పష్టమైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం తరపున కమల్ డీఎంకేకు మద్దతు ప్రకటించడంతో పాటు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కూటమికి మద్దతుగా నిలిచి విజయానికి కారణమైన కమల్‌ను పెద్దల సభకు పంపిస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుంది.
ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
ఈవార్తను కూడా చదవండి: సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News