Share News

Delhi Special Court: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి నో

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:28 AM

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు జారీ చేయాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్‌ను నేరుగా పరిగణనలోకి తీసుకోవడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది

Delhi Special Court: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి నో

  • నిరాకరించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు

  • నేషనల్‌ హెరాల్డ్‌ కేసు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల బదిలీలో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇతరులకు నోటీసులు ఇచ్చేందుకు శుక్రవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. వారికి నోటీసులు ఇవ్వాలన్న ఈడీ వినతిని ప్రత్యేక జడ్జి విశాల్‌ గోగ్నే అంగీకరించలేదు. కొత్త నిబంధనల ప్రకారం నిందితుల వాదనలు వినకుండా ఈడీ సమర్పించిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోకూడదని అందువల్ల వారికి నోటీసులు ఇవ్వలేమని తెలిపారు. అవసరముందని భావించినప్పుడు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ఛార్జిషీటులో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 05:28 AM