Share News

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

ABN , Publish Date - Apr 27 , 2025 | 02:05 PM

గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్
Gautam Gambhir

న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)ను చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు (Arrest) చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ (Threat Email) పంపిన వ్యక్తి గుజరాత్‌ (Gujarat)కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering Student) జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ (21) (Jignesh Parmar)గా గుర్తించారు. 'ఐసిస్ కాశ్మీర్' అనే మెయిల్ ఐడీతో 'ఐ కిల్ యూ' అంటూ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి.. జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ను అరెస్ట్ చేశారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు.

Also Read..: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..


పోలీసులు తెలిపిన వివరాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ టెర్రరిస్టులు 26 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అదే రోజున అనుమానాస్పద జీ మెయిల్ ఖాతా నుండి గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘ఐ కిల్ యు’ అని బెదిరింపు వచ్చింది. దీనిపై గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశామని, గుజరాత్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేశామన్నారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఎం హర్ష వర్ధన్ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జిగ్నేష్ సింగ్ పర్మార్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అతడి మానసిక పరిస్థితి బాగోలేదు. అతడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని విద్యార్థి కుటుంబం తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..

హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..

ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - Apr 27 , 2025 | 02:06 PM