Share News

Rekha Gupta: మహిళా దినోత్సవం... నెలకు రూ.2,500 సాయానికి కేబినెట్ ఆమోదం

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:42 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు.

Rekha Gupta: మహిళా దినోత్సవం... నెలకు రూ.2,500 సాయానికి కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించే 'మహిళా సమృద్ధి యోజన' (Mahila Samridhi Yojana) పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) శనివారంనాడు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. మహిళా సంక్షేమం, మహిళా భద్రతకు తాను పనిచేస్తానని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో పింక్ టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు.

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ


''ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ఈరోజు మంత్రివర్గం సమావేశమైంది. ఇందుకు సంబంధించిన పథకాన్ని ఆమోదించింది'' అని రేఖాగుప్తా తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.5,100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. తన సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు కానుందని, త్వరలోనే స్కీమ్ రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఇందుకు సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.


కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతినెలా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన హామీకి అనుగుణంగా మహిళా సమృద్ధి యోజన పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ఢిల్లీ మంత్రి మంజిదార్ సింగ్ సిర్సా తెలిపారు. త్వరలోనే ఒక పోర్టల్ ఏర్పాటవుతుందని, మహిళలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మంత్రులు కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీ ఈ స్కీమ్ విధివిధానాలను నిర్ణయిస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2025 | 05:31 PM