Share News

CM Athishi: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

ABN , Publish Date - Feb 04 , 2025 | 06:50 PM

CM Athishi: మరికొద్ది గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. సీఎం అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎన్నికల సంఘంపై సీఎం అతిషి విరుచుకు పడ్డారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరితోపాటు వారి కుటుంబ సభ్యులు దాడులు చేస్తూన్నా.. ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

CM Athishi: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?
CM Athishi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: మరికొద్ది గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ ఢిల్లీ సీఎం, ఆప్ ఎమ్మెల్యే అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి( మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని అతిక్రమించారంటూ ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక గోవిందపూరి పోలీస్ స్టేషన్ లో ఢిల్లీ సీఎం అతిషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

ఫతే సింగ్ మార్గ్‌లో ఆప్ అభ్యర్థి అతిషి 50 నుంచి 70 మంది మద్దతుదారులతోపాటు 10 వాహనాలతో కనిపించడంతో.. ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాలను అనుసరించి ఆ ప్రాంత్రాన్ని ఖాళీ చేయాలని వారిని పోలీసులు అదేశించారు. కానీ ఆ అధికారిని.. తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు.


మరోవైపు సీఎం అతిషి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురితోపాటు వాళ్ల కుటుంబ సభ్యుల బహిరంగంగా దాడులకు దిగుతున్నారని విమర్శించారు. వీరిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టదన్నారు. ఆ క్రమంలో ఎన్నికల కమిషన్‌పై ఆమె విమర్శలు గుప్పించారు.

Also Read: కర్నూలులో బెంచ్‌‌ ఏర్పాటు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్


బుధవారం జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలతోపాటు 1267 మంది థర్డ్ జండర్‌లు ఉన్నారని ఎన్నికల సంఘం వివరించింది. వీరు ఓటు హక్కు వినియోంచుకోనేందుకు 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో భద్రత కోసం 220 కంపెనీల పారామిలటరీ ఫోర్స్‌, 19 వేల మంది హోం గార్డులు, దాదాపు 40 వేల మంది ఢిల్లీ పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపింది.

Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండనుంది. ఈ ఎన్నికల్లో వరుసగా ఆప్ విజయం సాధిస్తూ వస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం మళ్లీ గెలిచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఎవరికి ఈ ఢిల్లీ పీఠం కడతారనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ

Also Read: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం

For National News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 07:04 PM