Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం

ABN , Publish Date - Mar 11 , 2025 | 07:05 PM

కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం
arvind-kejriwal

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలంటూ 2019లో దాఖలైన పిటిషన్‌పై విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మార్చి 18వ తేదీలోగా కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను అదేశించింది.

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు


కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టును కోరారు. దీనిపై అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేహా మిట్టల్ మంగళవారంనాడు ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు.


దీనికి ముందు 2022లో ఈ ఫిర్యాదును మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు తోసిపుచ్చారు. అయితే సెషన్ కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేస్తూ పిటిషన్‌ను పునఃపరిశీలించాలని మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' పదేళ్ల పాలనకు బీజేపీ గండికొడుతూ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో హోర్డింగ్‌ల పేరుతో ప్రజానిధుల దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదుకు కోర్టు ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి

Land For Job Scam Case: లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్, కుమార్తె హేమకు బెయిల్

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2025 | 09:46 PM