Home » Arvind Kejriwal
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైనందున కోర్టు తీర్పును గౌరవించాలని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసునుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది.
ఢిల్లీ 'శీష్ మహల్'ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్‌కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్‌ను ఛండీగఢ్‌లోని సెక్టార్-2లో నిర్మించారని బీజేపీ తెలిపింది.
కేజ్రీవాల్ 2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 4న ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ఆప్ పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు. బంగ్లా కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కేజ్రీవాల్ పోస్ట్‌ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.
అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకూ 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులు అవుతారని అన్నారు.
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ..