Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం మరో శీష్ మహల్.. ఫోటో షేర్ చేసిన బీజేపీ
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:32 PM
ఢిల్లీ 'శీష్ మహల్'ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్‌కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్‌ను ఛండీగఢ్‌లోని సెక్టార్-2లో నిర్మించారని బీజేపీ తెలిపింది.
న్యూఢిల్లీ: శీష్ మహల్ (Sheeshmahal) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'శీష్ మహల్' (అద్దాలమేడ) అంశం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని గట్టి దెబ్బ తీసింది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌కు ఛండీగఢ్‌లో 7 స్టార్ భవనం కేటాయించారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటోను కూడా షేర్ చేసింది.
'సాధారణ వ్యక్తిగా చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన మరో శీష్ మహల్ ఇది' అంటూ బీజేపీ ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఢిల్లీ 'శీష్ మహల్'ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్‌కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్‌ను ఛండీగఢ్‌లోని సెక్టార్-2లో నిర్మించారని తెలిపింది. రెండెకరాల్లో విస్తరించి ఉన్న ఈ శీష్ మహల్‌ను పంజాబ్ ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపింది. కాగా, ఈ ఫోటోను ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పంచుకున్నారు. గత ఏడాది మేలో స్వాతి మాలివాల్, కేజ్రీవాల్ మధ్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి.
కాగా, శీష్ మహల్ 2.0 అంటూ బీజేపీ షేర్ చేసిన ఫోటోపై కేజ్రీవాల్ కానీ, ఆప్ కానీ వెంటనే స్పందించలేదు. ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు రూ.45 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించారంటూ బీజేపీ అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిని అసెంబ్లీ ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మార్చుకుంది. ఈ ప్రచారం ఆప్ విజయావకాశాలను గండికొట్టింది. ఢిల్లీలోని శీష్ మహల్‌ను గెస్ట్ హౌస్‌గా కన్వర్ట్ చేస్తామని ఢిల్లీ బీజేపీ సర్కార్ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్ మెటీరియల్
పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి