Arvind Kejriwal: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:06 PM
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అన్ని స్థానాలకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు.

బీహార్ ప్రజలు (bihar elections 2025) మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఆప్షన్‌గా ఉంటుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఈ క్రమంలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీపై ఆధారపడకుండా ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకే పరిమితం అని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ స్వతంత్రంగా పాల్గొంటుందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ గురించి..
కాంగ్రెస్ గురించి ఆయన సమాధానమిస్తూ, మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదన్నారు కేజ్రీవాల్. మాకు కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే, వారు విసావదర్ (గుజరాత్ అసెంబ్లీ నియోజకవర్గం)లో ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారని ప్రశ్నించారు. మమ్మల్ని ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్‌ను విసావదర్‌కు పంపిందని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో కలకలం
కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు, ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు, బీహార్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే తన ఉనికిని చాటుకుంది. కానీ ఈసారి అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం మహా కూటమి, NDA రెండింటికీ కొత్త సవాళ్లను తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీహార్‌లో మొత్తం
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు 2025 అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్–నవంబర్ మధ్యలో జరిగాయి. ఆ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) విజయం సాధించి, నితీశ్ కుమార్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగస్టులో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) NDAను విడిచి, రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేతృత్వంలోని మహాఘటబంధన్తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎక్కువకాలం నిలువలేదు. 2024 జనవరిలో JD(U) మళ్లీ మహాఘటబంధన్‌కు గుడ్‌బై చెప్పి, NDAతో చేతులు కలిపి బీహార్ పరిపాలనను చేపట్టింది.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి