AAP INDIA Alliance Exit: ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:28 AM
విపక్ష ఇండియా కూటమిలో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ..

న్యూఢిల్లీ, జూలై 18: విపక్ష ఇండియా కూటమిలో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగం కాదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల నేతలు శనివారం సాయంత్రం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమితో మా పొత్తు 2024 లోక్‌సభ ఎన్నికల కోసమే. ఢిల్లీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేశాం. బిహార్‌లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం. పంజాబ్, గుజరాత్‌లో ఉప ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశాం. ఇండియా కూటమిలో ఆప్ భాగం కాదు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపైనా సంజయ్ సింగ్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడంలో ఆ పార్టీ పాత్రను ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి