Share News

Nirmala Sitharaman: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి.. నిర్మలా సీతారామన్ రియాక్షన్.. ఏమన్నారంటే..!

ABN , Publish Date - May 31 , 2025 | 08:30 PM

జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

Nirmala Sitharaman: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి.. నిర్మలా సీతారామన్ రియాక్షన్.. ఏమన్నారంటే..!
Nirmala Sitharaman

జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ నెట్టింట ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. జీఎస్టీ నంబర్ పొందడం కోసం అవినీతికి పాల్పడబోతున్నానంటూ లింక్డ్‌ఇన్ సైట్‌లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఆమె.. ప్రజల సమస్యల మీద వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడమే తమకు చాలా ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు.


అసలేం జరిగిందంటే..

జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి వినోద్ గుప్తా అనే ఒక వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. జీఎస్టీ నంబర్ కోసం దరఖాస్తు చేశానని, 20 రోజులు దాటినా నంబర్ రాలేదన్నాడు. దీంతో జీఎస్టీ నంబర్ కోసం లంచం ఇవ్వనున్నట్లు ఆ పోస్ట్‌లో అతడు రాసుకొచ్చాడు. దీంతో పలువురు టాక్స్ నిపుణులు ఈ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను కోట్ చేసి సీబీఐసీకి ట్యాగ్ చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినితీ గురించి తెలియడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ అవినీతిని అంతమొందించాలని కోరారు.


వాస్తవాలు తెలుసుకోండి..

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి వ్యవహారం నెట్టింట హల్‌చల్ చేయడంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రియాక్ట్ అయ్యారు. సత్వరమే స్పందించాలని అధికారులకు ఆమె సూచించారు. కాగా, వినోద్ గుప్తా దరఖాస్తు మే 26న ఫైల్ చేశారని సీబీఐసీ తెలిపింది. రెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతోనే దరఖాస్తు ఇంకా పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసింది. పెండింగ్ వివరాలు అందజేస్తే జీఎస్టీ నంబర్ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేస్తారని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు క్లారిటీ ఇచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేయొద్దని పేర్కొంది.


ఇవీ చదవండి:

గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి..

600 డ్రోన్లతో తెగబడిన పాక్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 08:35 PM