Tejaswi Yadav: రెండు ఓటరు కార్డుల వివాదం.. తేజస్విపై ఫిర్యాదు
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:05 PM
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించిన ఈసీ ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది.

పాట్నా: ఓటర్ల జాబితాలో తన పేరు లేదంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) చేసిన వ్యాఖ్యలపై ఓవైపు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేయగా, మరోవైపు వేర్వేరు నెంబర్లతో రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారంటూ ఆయనపై తాజాగా ఫిర్యాదు నమోదైంది. పాట్నాలోని డిఘా పోలీసు స్టేషన్‌లో రాజీవ్ రంజన్ అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించిన ఈసీ ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో తేజస్వి యాదవ్ గత శనివారంనాడు మీడియా సమావేశంలో తన ఓటర్ ఐడీని చూపిస్తూ తన పేరు ఓటర్ల జాబితాలో లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. పాట్నాలోని బిహార్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీలోని 204వ పోలీస్ స్టేషన్‌లో సీరియల్ నెంబర్ 416లో తేజస్వి పేరు ఉందని తెలిపింది. ఆయన ఎపిక్ నెంబర్ RAB0456228 అని తెలిపింది. అయితే తేజస్వి మీడియా సమావేశంలో చూపించిన ఎపిక్ నెంబర్ RABN2916120గా ఉంది. 2015 నుంచి 2020 పోల్స్ వరకూ ఆ కార్డు చెల్లుబాటును కలిగి ఉంది.
రెండు ఎపిక్‌లు కలిగి ఉండటం క్రిమినల్ నేరమని బీజేపీ తప్పుపట్టడంతో ఈసీ స్పందించింది. తేజస్వి మీడియా సమావేశంలో చూపించిన ఎపిక్ వివరాలను తమకు అందజేయాలని తేజస్వికి ఇచ్చిన నోటీసులో ఈసీ కోరింది. వివరాలు అందజేస్తే దానిపై దర్యాప్తు జరుపుతామని తెలిపింది.
ఇవి కూాడా చదవండి..
కొంతమంది అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి