Akhilesh Yadav: ఏ ఫర్ అఖిలేష్.. డీ ఫర్ డింపుల్ అంటూ స్కూల్లో పాఠాలు.. సమాజ్‌వాదీ నేతలపై కేసులు..
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:25 PM
పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా రాజకీయ పాఠాలు నేర్పుతున్న విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లో నెలకొంది. అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్‌కు బదులుగా.. ఏ ఫర్ అఖిలేష్, డీ ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్నారు.

పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా రాజకీయ పాఠాలు నేర్పుతున్న విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లో నెలకొంది. అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్‌కు బదులుగా.. ఏ ఫర్ అఖిలేష్ (A for Akhilesh), డీ ఫర్ డింపుల్ (D for Dimple), ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్నారు. యూపీలోని పీడీఏ పాఠశాలల్లో సమాజ్‌వాద్ పార్టీ నేతలు ఈ తరహా పొలిటికల్ పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ పరిసర ప్రాంతాల్లో పిల్లలు తక్కువగా ఉన్నారనే కారణంతో యోగి ప్రభుత్వం కొన్ని పాఠశాలలను మూసేసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష సమాజ్‌వాద్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో పీడీఏ పాఠశాల (PDA Pathshala)లను ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెబుతున్నారు. అయితే తమ పిల్లలకు స్థానిక ఎస్పీ నేత ఫర్హాద్ ఆలం గడా (Farhad Alam Gada) పొలిటికల్ పాఠాలు చెబుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫర్హాద్ పాఠశాలలోని పిల్లలకు ఏ ఫర్ అఖిలేష్, డీ ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాఠశాలలో అక్షరాలను రాజకీయల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తమ పాఠశాలలను మూసివేయించడానికి బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది అని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ
మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..