Share News

CM Siddaramaiah: ఇందులో ఏం డౌట్ లేదు.. ఐదేళ్ళు నేనే సీఎం..

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:39 PM

రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్‌చల్‌ చేస్తోంది.

CM Siddaramaiah: ఇందులో ఏం డౌట్ లేదు.. ఐదేళ్ళు నేనే సీఎం..

- ఢిల్లీ వేదికగానే తేల్చి పడేసిన సిద్దరామయ్య

- కుర్చీ మార్పుపై ఎలాంటి ఒప్పందం లేదని వ్యాఖ్యలు

- నాయకత్వ బదిలీ అంశం ముగిసినట్టేనా..

- డీకే శివకుమార్‌ వర్గీయుల్లో కలకలం

బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్‌చల్‌ చేస్తోంది. మే నెలతో రెండేళ్ళు పూర్తీ అవుతుందని తేలిపోనుందని చర్చ జరిగింది. తాజాగా రెండున్నరేళ్ళు కావాలంటే నవంబరు దాకా ఆగాల్సి ఉంటుందనే అంశం కొనసాగింది. కానీ సీఎం సిద్దరామయ్య సరిగ్గా వారం కిందట కేబినెట్‌ సమావేశం ముగిశాక డీసీఎం డీకే శివకుమార్‌(DCM Siddaramaiah) సమక్షంలోనే ఐదేళ్ళు నేనే సీఎంగా ఉంటానని ఇందులో ఎటువంటి మార్పులు లేవన్నారు.


దీంతో ఒక్కసారిగా డీకే శివకుమార్‌ సహా ఆయన ఆప్తులు, అనుచరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత డీకే శివకుమార్‌ కూడా ప్రత్యామ్నాయం లేకుండా మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలా సాగుతుండగానే ఢిల్లీ వేదికగా సీఎం సిద్దరామయ్య తేల్చిపడేశారు. నాయకత్వ మార్పులేదని ఐదేళ్ళు నేనే సీఎంగా ఉంటానన్నారు. రెండున్నరేళ్ళకు మార్పు అనేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడా అటువంటి ఒప్పందం చర్చలు జరుగలేదన్నారు. ఢిల్లీలో గురువారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత కర్ణాటక భవన్‌లో మీడియాతో సీఎం మాట్లాడుతూ.. రెండున్నరేళ్ళకు అధికారం అప్పగించేలాంటి ఎటువంటి ఒప్పందం కాలేదన్నారు.


కానీ మేమిద్దరం స్నేహంగా ఉన్నామన్నారు. వారం కిందట డీకే శివకుమార్‌ సమక్షంలోనే ఐదేళ్ళు సీఎంగా కొనసాగుతానని చెప్పానన్నారు. ఇందుకు సంబంధించి జరుగుతున్నదంతా కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు మార్పు ప్రస్తావనలు తెస్తున్నారు కానీ అధిష్టానం ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ లేదన్నారు. ఎక్కడా అధికారం పంచుకునేలాంటి ఒప్పందమే జరుగలేదన్నారు. ఢిల్లీ వేదికగా సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు ఒక్కసారిగా కాంగ్రె్‌సలో కలకలం రేపింది. సిద్దరామయ్యతో పాటే ఢిల్లీలోనే ఉన్న డీకే శివకుమార్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.


pandu4.2.gif

కాగా సిద్దరామయ్యకు ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు ఉన్నఫళంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను సదాశివనగర్‌లోని నివాసంలో కలిశారు. మంత్రులు మహదేవప్ప, జమీర్‌అహ్మద్‌, ఈశ్వర్‌ఖండ్రే, పరమేశ్వర్‌, దినే్‌షగుండూరావ్‌, శరణుప్రకాష్‌ పాటిల్‌లు కలిశారు. సుమారు గంటకు పైగా వారు చర్చలు జరిపారు. అయితే ఇదే సాధారణ భేఠీ మినహా ప్రత్యేకత ఏదీ లేదంటూ మంత్రులు దాటవేశారు. సీఎం సిద్దరామయ్య స్పష్టమైన వ్యాఖ్యలకు అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 01:39 PM