CM Stalin: మా బంధం పటిష్ఠం.. రాహుల్ ఆప్యాయత అమోఘం
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:19 PM
డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.
- ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
చెన్నై: డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు. దేశ సంక్షేమం కోసం పాటుపడటమే రెండు పార్టీల ఆశయమని, ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా పోరాడుతామఅన్నారు.

మంగళవారం ఉదయం అరివాలయంలోని కలైంజర్ అరంగంలో జరిగిన విరుదునగర్ ఈస్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీరాజా చొక్కర్ కుమారుడు శివరాజా శ్రీ రాజా వివాహవేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ సంక్షేమం కోసం ప్రత్యేకించి దేశసమైక్యత కోసం కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలను ఎన్నడూ మరువలేనన్నారు. రాహుల్(Rahul) తనను వ్యక్తిగతంగా కలిసినప్పుడు డియర్ బ్రదర్ అనే సంబోధిస్తారని చెప్పారు. తానింతవరకూ ఏ పార్టీ నాయకులను సోదరుడని సంబోధించలేదని పేర్కొన్నారు.

ఇదంతా తాను ఎందుకు చెబుతున్నానంటే పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా, కాంగ్రెస్, డీఎంకే మధ్య విడదీయలేని రాజకీయ అనుబంధంతోపాటు, ఆత్మీయ అనుబంధం కూడా పటిష్టంగా ఉందని చెప్పడానికేనని స్టాలిన్ అన్నారు. తన సమక్షంలో ఆదర్శవివాహం చేసుకున్న దంపతులు తమకు పుట్టబోయే బిడ్డలకు తమిళ పేర్లు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదర్శవివాహాలు చట్టబద్ధం కాకముందు కాంగ్రెస్ ఈ వివాహాలను పెద్దగా పట్టించుకోలేదని, 1967 తర్వాత రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివాహాలు చెల్లుబాటు అయ్యేలా కొత్త చట్టమే తీసుకొచ్చారని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
Read Latest Telangana News and National News