Share News

Pranab Mukherjee: ప్రణబ్ సమాధి స్థలానికి కేంద్రం ఆమోదం.. మోదీకి షర్మిష్ట కృతజ్ఞతలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:04 PM

ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతటవే వరించి రావాలని బాబా (ప్రణబ్) చెప్పేవారని, బాబా మెమెరీని గౌరవిస్తూ ముందుకు వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షర్మిష్ట ముఖర్జీ చెప్పారు.

Pranab Mukherjee: ప్రణబ్ సమాధి స్థలానికి కేంద్రం ఆమోదం.. మోదీకి షర్మిష్ట కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukharji) సమాధి ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపునకు కేంద్రం మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజ్‌ఘాట్ ఆవరణలోని 'రాష్ట్రీయ స్మృతి' కాంప్లెక్స్‌లో ఒక స్థలాన్ని కేటాయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రణబ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ గౌరవాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.

Atishi: సీఎం నివాసం నుంచి నన్ను మళ్లీ గెంటేశారు.. అతిషి సంచలన వ్యాఖ్యలు


''బాబా (ప్రణబ్) స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వయంగా మేము కోరకపోయినా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయడం ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతుంది. ఊహించని విధంగా తీసుకున్న ఈ నిర్ణయం మా మనసులను కదిలించింది'' అని ఒక ట్వీట్‌లో షర్టిష్ట ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు.


ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతటవే వరించి రావాలని బాబా (ప్రణబ్) చెప్పేవారని, బాబా జ్ఞాపకాలను గౌరవిస్తూ ముందుకు వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షర్మిష్ట చెప్పారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. కాంగ్రెస్ వెటరన్ నేత ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో పలు మంత్రి పదవులు చేపట్టడం తో పాటు భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని చేపట్టారు. 84 ఏళ్ల వయస్సులో 2020 ఆగస్టు 31న ఆయన కన్నుమూశారు.


Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!

Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం

Read Latest National News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 07:05 PM