Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:42 PM
వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2025 (Union Budget 2025)పై పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రశంసలు కురిపించారు. ఇది విజనరీ బడ్జెట్ అని, అందర్నీ కలుపుకొని వెళ్లే బడ్జెట్ అని అభివర్ణించారు. వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందనలు తెలిపారు.
Union Budget 2025 : గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు గుడ్ న్యూస్.. ఐడీ కార్డులు.. అదనంగా ఈ ప్రయోజనాలు..
మోదీ ప్రభుత్వ విజన్‌కు బ్లూప్రింట్: అమిత్‌షా
కేంద్ర బడ్జెట్‌పై అమిత్‌షా సోషల్ మీడియాలో ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రిని అభినందించారు. ''ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతున్న, బెస్ట్ ఇండియా నిర్మాణం దిశగా మోదీ ప్రభుత్వ విజన్‌కు బడ్జెట్ 2025 ఒక బ్లూప్రింట్. రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, బాలల విద్య, న్యూట్రీషియన్ అండ్ హెల్త్ నుంచి స్టార్టప్, ఇన్నొవేషన్ వరకూ ప్రతి రంగంపైన బడ్జెట్‌లో దృష్టి సారించారు" అని అమిత్‌షా అన్నారు. మధ్యతరగతి వర్గం ఎప్పుడూ మోదీ హృదంయలో ఉంటారని, 12 లక్షల ఆదాయం వరకూ జీరో టాక్స్ వల్ల మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, లబ్దిదారులందరికీ ఈ సందర్భంగా అభినందలు తెలుపుతున్నానని అన్నారు.
స్వయంసమృద్ధి భారత్‌కు చేయూత: శివరాజ్
బీజేపీ 3.0 బడ్జెట్‌పై శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. "స్వయం సమృద్ధి భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. అభివృద్ధి భారత్ నిర్మాణాన్ని సాధించడానికి అవసరమైన పట్టుదల, గట్టి నమ్మకం బడ్జెట్‌లో కనిపించింది. బడ్జెట్‌లో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. మధ్యతరగతి వర్గానికి భారీ గిఫ్ట్ ఇచ్చారు. ఆదాయం పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచుతారని ఏ ఒక్కరూ ఊహించలేదు" అని అన్నారు. అన్నిరంగాల అభివృద్ధిపై బడ్జెట్ దృష్టి సారించిందన్నారు. ప్రజాసంక్షేమం, మానవతా దృక్పథంతో బడ్జెట్ రూపొందించినందుకు ప్రధాన మంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
ఇన్నొవేషన్, ఇన్‌క్లూజన్: గడ్కరి
ఇన్నొవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్ సహా సంస్కరణలు, యువనాయకత్వం, కమ్యూనిటీ పార్టిసిపేషన్, మహిళా సాధికారత, కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధికి బడ్జెట్ పట్టం కట్టిందని నితిన్ గడ్కరి అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, డిజిటల్ విస్తరమ, మౌలిక సదుపాయలతో సంపద వృద్ధి పెరుగుతుందన్నారు.
అభివృద్ధి భారత్ దిశగా: రాజ్‌నాథ్ సింగ్
అభివృద్ధి భారత్ దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల సాకరం దిశగా రూపొందించిన అద్భుతమైన బడ్జెట్ ఇదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. యువత, పేదలు, రైతులు, మహిళలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు. కాగా, బీజేపీ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పేదలు, యువకులు, రైతులకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, మహిళా సాధికారణ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పనకు దోపదపడుతుందని హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ అన్నారు.కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.5 లక్షలకు పెంచడం వల్ల తమ (హర్యానా) రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కాగా, ఇది గొప్ప బడ్జెట్ అని, ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనం చేకూరే బడ్జెట్అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసించారు. రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మైలురాయని అన్నారు. వ్యవసహాయం రంగంలోనూ పలు స్కీమ్‌లు ప్రవేశపెట్టారని, ఇది పాథ్‌బ్రేకింగ్ బడ్జెట్ అని కొనియాడారు.
Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే
Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి