Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్ జవాన్
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:35 AM
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పీకే సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి

అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు
విడుదల కోసం ఇరుదేశాల బలగాల మధ్య చర్చలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అనుకోకుండా సరిహద్దును దాటిన సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎఫ్) జవాన్‌ను పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మన జవాన్‌ను సురక్షితంగా విడుదల చేసేందుకుగాను ఇరు బలగాల మధ్య చర్చలు జరుగుతున్నాయని గురువారం అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సాహు.. నీడలో విశ్రాంతి తీసుకోవడానికి రైతులతో పాటు వెళ్లాడు. ఆ తరుణంలో అతన్ని బుధవారం పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో జవాన్ యూనిఫాంను ధరించి ఉండటమేకాకుండా తన సర్వీస్ రైఫిల్‌ను కూడా కలిగి ఉన్నారు. జవాన్‌ను విడుదల చేయడానికి ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్ సమావేశం జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్