Bombay High Court: రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:13 PM
అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. తాను సావర్కర్ గురించి రీసెర్చ్ చేసినట్టు ఆయన తెలిపారు. సావర్కర్ గురించి రాహుల్ ఏ మాత్రం పరిపక్వత, బాధ్యతలేకుండా మాట్లాడుతున్నందున ఆయనను తన పిటిషన్ కాపీ చదివేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

ముంబై: హిందుత్వ నేత సావర్కర్ గురించి చదివి, అవగాహన చేసుకునేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఆదేశాలివ్వాలంటూ కోరిన పిటిషనర్‌పై బాంబే హైకోర్టు (Bombay High Court) మంగళవారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ పిటిషన్‌ను చదవాలని ఆయనను ఎందుకు బలవంతం చేస్తారని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. తాను సావర్కర్ గురించి రీసెర్చ్ చేసినట్టు ఆయన తెలిపారు. సావర్కర్ గురించి రాహుల్ ఏ మాత్రం పరిపక్వత, బాధ్యతలేకుండా మాట్లాడుతున్నందున ఆయనను తన పిటిషన్ కాపీ చదివేలా ఆదేశించాలని కోర్టును కోరారు. మీ పిటిషన్ చదవాలని మేము ఎలా బలవంతం చేస్తామని న్యాయమూర్తులు అలోక్ అరాధే, సందీప్ మార్నేతో కూడిన ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ సమాధానమిస్తూ, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గందరగోళం సృష్టిస్తున్నారని, ఆయన ప్రధాని అయితే విధ్వంసం సృష్టిస్తారని పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు. మీకు తెలుసా?' అని ప్రశ్నించింది. అయితే రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు పెట్టేందుకు పిటిషనర్‌కు అవకాశం ఉందని తెలిపింది. సావర్కర్ మనవడు ఇప్పటికే రాహుల్‌పై పుణెలోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారని, అక్కడ విచారణ జరుగుతోందని బెంచ్ పేర్కొంది. పిటిషనర్ అంతకుముందు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందని వెల్లడించింది.
సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ను గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులపై ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ఆమోదించదని తెలిపింది. 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సావర్కర్ పెన్షన్ తీసుకున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవాడు: ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు
యెమెన్‌లో కేరళ నర్సుకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి