BJP Suspends RK Singh: కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:42 PM
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో పార్టీ అసమ్మతి నేతలపై రాష్ట్ర బీజేపీ కొరడా ఝలిపించింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ (RK Singh)ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఈ చర్య తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శిగా ఆర్కే సింగ్ పనిచేశారు.
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి, అనంత్ సింగ్ సహా నేరచరిత్ర ఉన్న నేతలను ఓడించాలన్నారు.
ఆర్కే సింగ్‌తో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అభియోగంపై ఎమ్మెల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, ఆయన భార్య, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను సైతం బిహార్ బీజేపీ సస్పెండ్ చేసింది. అశోక్ అగర్వాల్ తన కుమారుడు సౌరవ్ అగర్వాల్‌ను కతిహార్ నుంచి వీఐపీ అభ్యర్థిగా నిలబెట్టారు.
ఇవి కూడా చదవండి..
ఫరీదాబాద్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి..
హీరో విశాల్ - లైకా కేసు... విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..