Share News

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:39 PM

ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్‌ పేర్కొన్నారు.

MLA: ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. జీతభత్యాలు తీసుకోను.. కనీసం టీ, కాఫీలు కూడా..

- జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్‌

బెంగళూరు: ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్‌(JDS MLA Sharanagowda Kandakur) పేర్కొన్నారు. బెళగావిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్తరకర్ణాటక జిల్లాలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై చర్చలకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ యూటీ ఖాదర్‌కు లేఖ రాశానన్నారు.


pandu2.jfif

గురుమిట్కల్‌ నియోజకవర్గం నుంచి బెళగావి(Belagavi) సమావేశాలకు వచ్చి వెళ్ళే రవాణా ఖర్చులతో పాటు వేతనం, ఇతర భత్యాలను స్వీకరించేది లేదని లేఖలో పేర్కొన్నానన్నారు. ఉత్తరకర్ణాటక సమస్యలు పరిష్కరించాలనే బెళగావిలో ఏటా శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతారని, అందుకుగాను రూ.30కోట్లదాకా ఖర్చు అవుతుందన్నారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.


pandu2.3.jpg

శాసనసభ సమావేశాలకు హాజరవుతానని బయట నుంచి భోజనం తెప్పించుకుంటానని కనీసం టీ, కాఫీలు కూడా సువర్ణసౌధలో తీసుకునేది లేదన్నారు. ఉత్తరకర్ణాటక ప్రాంతానికి చెందిన వారిలో ఎక్కువమంది రైతులు, పేదలు, కార్మికులే అధికంగా ఉన్నారన్నారు. ఎన్నో సమస్యలతో దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారన్నారు. శాసనసభ్యులు విహారయత్రలా భావించి వచ్చి వెళ్తున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 01:39 PM