Share News

Ranya Rao: రన్యారావుకు పెళ్లికి హాజరైన సీఎం.. వెలుగుచూసిన ఫోటో

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:55 PM

మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.

Ranya Rao: రన్యారావుకు పెళ్లికి హాజరైన సీఎం.. వెలుగుచూసిన ఫోటో

బెంగళూరు: దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా (Gold Smuggling) చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా రన్యారావు వివాహ వేడుకకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddharamaiah), రాష్ట్ర మంత్రి జి.పరమేశ్వర హాజరైన ఫోటో ఒకటి వెలుగు చూసింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malaviya) ఈ ఫోటోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

Sudha Murthy: ఎక్కువ భాషలు రావడం మంచిదే.. నాకు ఎన్ని వచ్చంటే?


"రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందుకు వచ్చింది. ఇందులో ప్రస్తుత హోం మంత్రి జి.పరమేశ్వర కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో రాజకీయ సంబంధాలు లేవని డీకే శివకుమార్ చెబుతున్నారు'' అని అమిత్ మాలవీయ ఆ పోస్ట్‌లో విమర్శించారు.


మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. రన్యారావు ఏడాదిలో 30 సార్లు దుబాయ్ వెళ్లినట్టు డీఆర్ఐ గుర్తించింది. విమాశ్రయం వద్ద ప్రోటోకల్ ఉల్లంఘనలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తోంది. ఈ క్రమంలో గోల్ట్ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో ఆమె సవతి తండ్రి గౌరవ్ గుప్తా పాత్ర ఏదైనా ఉందా అనేది నిర్ధారించేందుకు కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను నియమించింది. కెంపెకౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై వాస్తవాలు వెలికితీసేందుకు సీఐడీ విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

Udayanidhi: పిల్లల్ని కనండి కానీ...ఉదయనిధి నోట అదేమాట.

Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..

Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2025 | 06:56 PM