BJP: హీరోగారూ.. ఆ పార్టీని ఓడిద్దాం... మా కూటమిలోకి రండి
ABN , Publish Date - May 29 , 2025 | 10:05 AM
హీరోగారూ.. ఆ పార్టీని ఓడిద్దాం... మా కూటమిలోకి రండి,, అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ కూడా చేరితే ఇక తిరుగులేని విజయం ఖాయమన్నారు.

- విజయ్‌కి బీజేపీ నేత నయినార్ పిలుపు
చెన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అవినీతి డీఎంకే(DMK) ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే), బీజేపీ ప్రధాన లక్ష్యం కనుక టీవీకే అధ్యక్షుడు విజయ్(Vijay) ఎన్డీయే కూటమిలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) పిలుపునిచ్చారు. మదురైలో బుధవారం ఉదయం ఆయన మురుగ భక్తుల మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.
ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీవీకే నేత విజయ్ పార్టీ ప్రారంభసమయంలో బీజేపీపై విమర్శలు చేశారని, అయితే తన రాజకీయ బద్ధశత్రువు డీఎంకే అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారని తెలిపారు. ఇటు బీజేపీ, అటూ టీవీకే ఏకైక లక్ష్యం డీఎంకే ప్రభుత్వానికి చరమగీతం పాడటమేనని స్పష్టమవుతోందన్నారు. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం ఒక్కటే అయినప్పుడు ఒకే కూటమిలో చేరి ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని,
ఆ దిశగా విజయ్‌ని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో వేల్ యాత్ర జరుపనున్నామని చెప్పారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర, శాసనసభ్యుల పాదయాత్ర ఇలా పలు ముమ్మర ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామని నయినార్ నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News