Tamilnadu Asssmbly Election 2026: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:17 PM
అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్‌షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.

చెన్నై: వచ్చే ఏడాది జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamilnadu Assembly Elections-2026) పొత్తులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ (AIADMK-BJP) కలిసి పోటీ చేయాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించినట్టు ఆన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.
Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్
అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండదు
అన్నాడీఎంకేతో ఎలాంటా షరతులు, డిమాండ్లు లేకుండానే పొత్తులు కుదుర్చుకున్నట్టు అమిత్‌షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విజన, నీట్ అంశాలపై అడిగినప్పుడు, అన్నాడీఎంకేతో ఈ అంశాలపై చర్చిస్తామని, అవసరమైతే కనీస ఉమ్మడి ప్రోగ్రాం ఉంటుందని చెప్పారు.
డీఎంకే అవినీతి, శాంతిభద్రతల పరిస్థితి, దళిత మహిళలపై అకృత్యాలు వంటి అంశాలపై వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వనున్నారని అమిత్‌షా అన్నారు. డీఎంకే హయాంలో రూ.39,000 కోట్ల లిక్కర్ స్కామ్, ఇసుక మైనింగ్ స్కామ్, ఎల్కాట్ స్కామ్, ట్రాన్‌పోర్ట్ స్కామ్, మనీ లాండరింగ్ స్కామ్‌లు చోటుచేసుకున్నాయని, తమిళనాడు ప్రజలకు డీఎంకే, ఉదయనిధి స్టాలిన్, స్టాలిన్ సమాధానమివ్వాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం తథ్యమని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగి ఈ మీడియా సమావేశంలో బీజేపీ నేత కె.అన్నామలై, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..