Share News

Bird flu: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:24 PM

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్ తో కోళ్ల ఫారాల్లో గుడ్ల నిల్వలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు.

Bird flu: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

చెన్నై: నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh State)లో బర్డ్‌ ఫ్లూ(Bird flu) విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు.

ఈ వార్తను కూడా చదవండి: Heri Vijay: దిష్టిబొమ్మలుగా ఉంటే ప్రయోజనం ఏంటి..


nani3.2.jpg

దీంతో, కోళ్ల ఫాంలలో గుడ్లు నిల్వలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో ఐదు రోజుల్లో గుడ్డుపై సుమారు 1.10 పైసలు తగ్గించి ప్రస్తుతం ఫాం ధర 3.80 పైసలుగా ఉంది. ప్రస్తుతం పాంలలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి పాడయ్యే అవకాశముందని, అలాగే, నిల్వలు కూడా పెరిగే అవకాశముందని ఫాం యజమానులు వాపోతున్నారు.


nani3.3.jpg

ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 01:58 PM