BPSC: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. 935 పోస్టులకు 9.7 లక్షల దరఖాస్తులు
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:58 AM
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పాట్నా, నవంబర్ 30: చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం(Govt job) సాధించడం ఓ లక్ష్యంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ పడిందంటే చాలు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. కొన్ని సార్లు చిన్న పోస్టులకు సైతం తీవ్రంగా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో పదుల సంఖ్యలో పోస్టులకు కూడా లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా.. తాజాగా బిహార్(Bihar)లో కూడా కనిపించింది. 935 పోస్టులకు 9.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవి ఆ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి దరఖాస్తులు కావడం గమన్హారం.
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 2026 జనవరిలో అసిస్టెంట్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (AEDO) నియామక పరీక్షను నిర్వహిస్తుంది. 935 ఖాళీలకు 9.7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇది చరిత్రలో ఇప్పటివరకు అత్యధికమని బీపీఎస్సీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ చివరి ఐదు రోజుల్లో రోజుకు సగటున 75,000 నుంచి 85,000 దరఖాస్తులు బీపీఎస్సీ నమోదు చేసింది. ఇంత భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదని కమీషన్ పేర్కొంది.
AEDO జీతం, ఖాళీ వివరాలు:
ఈ పోస్టులకు లెవల్-5 పే స్కేల్ (రూ. 29,200) ఉంటుంది. మొత్తం 935 ఖాళీలలో, 319 మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ పోస్టులలో రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వ్డ్ మనవళ్లు , మనవరాలు, దృష్టి లోపం ఉన్నవారు (VI), చెవిటివారు, మూగవారు (DD), లోకోమోటర్ వైకల్యం (LD), మానసిక రుగ్మత (PD) వంటి వైకల్యాలున్ వారికి అవకాశాలు కూడా ఉన్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:
జనరల్ కేటగిరీ: 374
ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS): 93
షెడ్యూల్డ్ కులం (SC): 150
షెడ్యూల్డ్ తెగ (ST): 10
అత్యంత వెనుకబడిన తరగతులు (EBC): 168
వెనుకబడిన తరగతులు (BC): 112
BC మహిళలు: 28
ఇవి కూడా చదవండి
సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి