Share News

Bihar: ఇండియా కూటమి 243 సీట్లలో పోటీ.. సీఎం ఎవరో చెప్పకనే చెప్పిన ఆర్జేడీ

ABN , Publish Date - May 04 , 2025 | 07:26 PM

ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు మనోజ్ ఝా చెప్పారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తామని, ఎన్డీయేను ఓడిస్తామని చెప్పారు.

Bihar: ఇండియా కూటమి 243 సీట్లలో పోటీ.. సీఎం ఎవరో చెప్పకనే చెప్పిన ఆర్జేడీ

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయేకు వ్యతిరేకంగా మహాకూటమి (Grand Alliance) 243 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా ఆదివారంనాడు ప్రకటించారు. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎంఎల్), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఉన్నాయి. శనివారంనాడిక్కడ కూటమి నేతలతో జరిగిన కీలక సమావేశానంతరం మీడియాతో మనోజ్ ఝా మాట్లాడుతూ, ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు చెప్పారు. ''మేం ఐక్యంగా ఉన్నాం. ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తాం. ఎన్డీయేను ఓడిస్తాం'' అని చెప్పారు. కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా మే 20న జరుగనున్న వర్కర్స్ స్ట్రైక్‌కు ఇండియా కూటమి మద్దతిస్తుందని, సంఘీభావం తెలుపుతుందని తెలిపారు.

India-Pak War: క్షిపణుల వర్షం కురిస్తే.. మాజీ దౌత్యవేత్త ఏమన్నారంటే


తేజస్వి సీఎం విషయంలో..

బీహార్‌ మహాకూటమికి నాయకత్వం విషయంలో వస్తున్న ఊహాగానాలను మనోజ్ ఝా కొట్టివేశారు. తేజస్వి యాదవ్ నాయకత్వం విషయంలో ఎలాంటి వివాదం లేదన్నారు. సరైన సమయంలో ప్రకటన వెలువడుతుందని, ఇందుకు అందరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు. కులగణనపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అది తమ కూటమి ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఈరోజుకూ అది తమ ప్రధాన అంశమేనని అన్నారు. కులగణన జరిగేంతవరకూ తమ ఫోకస్ దానిపైనే ఉంటుందని, షేర్ చేసిన డాటా సరైనదేనా అనే విషయంలో ఒక కన్నేసి ఉంచుతామని వివరించారు.


'ఉగ్ర' ఘటనలపై..

దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద సంబంధిత ఘటనలను మనోజ్ ఝా ఖండించారు. జాతీయ భద్రతకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టంచేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 07:30 PM