Share News

Bihar Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న భోజ్‌పురి నటుడు, పార్టీపై సస్పెన్స్..?

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:32 PM

గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్‌ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు.

Bihar Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న భోజ్‌పురి నటుడు, పార్టీపై సస్పెన్స్..?

పాట్నా: గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన భోజ్‌పురి (Bhojpuri) నటుడు, గాయకుడు పవన్ సింగ్ (Pawan Singh) ఈ ఏడాది చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పోటీ చేయనున్నట్టు తెలిపారు. బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశంపై అడిగినప్పుడు, దానికి కాలమే సమాధానం చెప్పాలని, ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదని ఒక చిత్రం ప్రమోషన్ వర్క్ కోసం వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తాం: యోగి


బీజేపీ నుంచి బహిష్కరణ

గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్‌ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.


రూ.16.75 కోట్ల ఆస్తులు

పవన్ సింగ్‌కు రూ.16.75 కోట్లు విలువ చేసే స్థిరచరాస్తులు ఉన్నాయి. కారాకాట్ లోక్‌సభ ఎన్నికల్లో ఇంటిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ఎలక్షన్ కమిషన్‌ ముందు దాఖలు చేసిన అఫిడవిడ్ ప్రకారం ఆయనకు రూ.11.70 కోట్ల స్థిరాస్తులు, రూ.5.04 కోట్ల చరాస్తులు ఉన్నాయి. చరాస్తుల్లో 5 బ్యాంకు అకౌంట్లు, మూడు కార్లు, మోటార్‌సైకిల్, రూ.31.09 లక్షల విలువైన నగలు, చేతిలో రూ.60,000 నగదు ఉన్నాయి.2022-23లో ఆయన ఆదాయం రూ.51.84 లక్షలుగా ఉంది. కాగా, పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ సైతం కొద్దిరోజుల క్రితం రోహటాస్‌ నుచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 04:33 PM