Bengaluru Rapido Case: ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. యువతి కాళ్లు తాకుతూ...
ABN , Publish Date - Nov 08 , 2025 | 07:21 PM
బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై యువతిని ఎక్కించుకుని వెళ్తున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో యువతి కాళ్లను తాకుతున్నాడు. తొలుత అన్నా.. ఇలా ప్రవర్తించవద్దని యువతి పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా అతడు వినకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన(Bengaluru Rapido case) వెలుగులోకి వచ్చింది. బైక్‌పై యువతిని ఎక్కించుకుని వెళ్తున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో యువతి కాళ్లను తాకుతున్నాడు. తొలుత అన్నా.. ఇలా ప్రవర్తించవద్దని యువతి పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా అతడు వినకుండా పదే పదే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్(Wilson Garden Police) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక వీడియోలో ఆ యువతి మాట్లాడుతూ.. 'బైక్‌పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని ఎంత వారించినా... మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నాను. అయితే సదరు వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. ఇక ఎవరితోనూ ఇలా ప్రవర్తించను అని చెప్పాడు. కానీ చివర్లో వెళ్లేటప్పుడు అసభ్య సజ్ఞతో నా వైపు వేలు చూపించాడు. అది నాకు మరింత అసౌకర్యంగా అనిపించింది' అని మహిళ తెలిపింది.
ఇక సదరు మహిళ గమ్యస్థానం రావడంతో దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ డ్రైవర్ ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. ఇదే విషయాన్ని తాను పోస్టు చేసిన ఇన్ స్టా గ్రామ్ వీడియోలో తెలిపింది. సదర మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్‌ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం ఇతర మహిళకు ఎదురు కాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్ స్టా పోస్ట్(Instagram post) లో బాధితురాలు పేర్కొంది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ ప్రాంత పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాపిడో(Rapido) సంస్థ స్పందించాల్సి ఉంది. ఈ ఘటన గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి