Constable Sucide: ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:49 PM
ఉప్పల్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. శనివారం ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు.
హైదరాబాద్: నగర శివారులో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. 2009 బ్యాచ్‌కు చెందిన 42ఏళ్ల శ్రీకాంత్.. ఉప్పల్ పరిధిలోని మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివాసముండేవారు. ఈయన ఫిలింనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా డ్యూటీకి గైర్హాజరవుతున్నారు. ఇంతలోనే ఆయన ఇంట్లో శనివారం ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాంత్.. ఇటీవల ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆయన సహోద్యోగులు సహా.. పోలీస్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
Bihar Elections: ఎన్నికల్లో మునిగిపోయేందుకు ప్రాక్టీసు.. రాహుల్‌పై మోదీ సెటైర్