Eating Papaya At Night: రాత్రి పూట బొప్పాయి పండు తింటే లాభమా?.. నష్టమా?..
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:55 PM
బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. కానీ, రాత్రిళ్లు బొప్పాయి తినటం మంచిదేనా?. ఒకవేళ రాత్రి పూట బొప్పాయి పండును తినటం వల్ల కలిగే లాభాలు ఏంటి?.. నష్టాలు ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పండ్లలో బొప్పాయి పండుది ఓ ప్రత్యేక స్థానం. ప్రతీ రోజూ బొప్పాయి పండును తినటం వల్ల మన శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, బొప్పాయి పండును కొంతమంది రాత్రిళ్ల పూట ఎక్కువగా తింటూ ఉన్నారు. మరి కొంతమంది రాత్రిళ్లు బొప్పాయి తింటే మంచిదా? కాదా? అన్న మీమాంసలో తినకుండానే ఆగిపోతున్నారు. మరి, రాత్రిళ్లు బొప్పాయి పండు తింటే లాభమా? నష్టమా?..
రాత్రిళ్లు బొప్పాయి పండు తింటే కలిగే ప్రయోజనాలు..
బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ప్రొటీన్స్‌ను బ్రేక్ చేయటంలో ఉపయోగపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయి పండులోని హై ఫైబర్ మలబద్ధకం లాంటి సమస్యల్ని నివారిస్తుంది. రాత్రి వేళ ఆరోగ్యకరమైన బోవెల్ మూమెంట్స్ ఉండేలా చూస్తుంది.
ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
బొప్పాయిలోని తక్కువ కాలరీలు ఆకలిని తగ్గించి బరువు అదుపులో ఉంచడానికి సాయపడతాయి.
బొప్పాయిలో విటమిన్ సీ కూడా అధికంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రాత్రిళ్లు బొప్పాయి తినటం వల్ల కలిగే నష్టాలు..
కొంతమందిలో నిద్రపోయే ముందు బొప్పాయి తినటం వల్ల కడుపులో వికారం ఏర్పడే అవకాశం ఉంది. కడుపు తిప్పటం లాంటివి కూడా జరగొచ్చు.
ఆయుర్వేదం ప్రకారం బొప్పాయి పండు శరీరాన్ని చల్ల బరుస్తుంది. సైనస్, డస్ట్ అలర్జీ ఉన్న వారు రాత్రిళ్లు బొప్పాయి తింటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సరిగా తోలు తీయని బొప్పాయి పండులో లాటెక్స్ ఉంటుంది. దాని కారణంగా గర్భిణీ స్త్రీలకు సమస్యలు వస్తాయి. గర్భిణులు బొప్పాయి పండు తినకపోవటం మంచిది.
ఇవి కూడా చదవండి
బైకర్‌కు ఊహించని షాక్.. ఏకంగా 20 లక్షల ఫైన్...
నూరేళ్లుగా నిత్యం వెలుగుతున్న దీపం.. ఎక్కడుందంటే?