Share News

మండిపోతాయ్‌ జాగ్రత్త...

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:54 AM

తీరప్రాంత జిల్లాల్లో మరో ఐదురోజులు వేడిగాలులతోపాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు కానున్నాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర కన్నడ జిల్లాను ఎల్లో అలర్ట్‌గా ప్రకటించింది.

మండిపోతాయ్‌ జాగ్రత్త...

- ఉత్తర కన్నడ జిల్లాకు హై అలర్ట్‌

- మరో ఐదు రోజులు భారీ ఎండలు

- వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరికలు

బెంగళూరు: తీరప్రాంత జిల్లాల్లో మరో ఐదురోజులు వేడిగాలులతోపాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు కానున్నాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర కన్నడ జిల్లాను ఎల్లో అలర్ట్‌గా ప్రకటించింది. రాష్ట్రమంతటా ఎండ వేడిమి పెరగనుందని సూచించింది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉడుపి(Udupi), ఉత్తరకన్నడ జిల్లాల్లో ఐదు రోజులపాటు వేడిగాలులు వీస్తాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: PM Modi: ఆసియా సింహాలు పెరిగాయ్‌


మూడు రోజులపాటు 30-40 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు ఉంటాయన్నారు. గరిష్టంగా తీరప్రాంత జిల్లాల్లో 35-38 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కానుందని, ఉత్తర కర్ణాటక ప్రాంతం బెళగావి, బీదర్‌, ధారవాడ, రాయచూరు, హావేరి(Belagavi, Bidar, Dharwada, Raichur, Haveri) జిల్లాల్లో 34-35 డిగ్రీలు, విజయపుర, గదగ్‌, కలబురగి, కొప్పళ, బాగల్కోటెలో 36-38 డిగ్రీలు, దక్షిణప్రాంతాలైన బెంగళూరు, చామరాజనగర, మడికేరి, మైసూరు(Bangalore, Chamarajanagara, Madikeri, Mysore)లలో 32-34 డిగ్రీలు, చిత్రదుర్గ, దావణగెరె, మండ్య, శివమొగ్గలలో 35-36 డిగ్రీలు నమోదు కానుందని ప్రకటించారు.


pandu1.2.jpg

గడిచిన 24 గంటలలో సాధారణంగా 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణం కంటే ఒకటిరెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వేళ ఎండలో తిరగకుండా ముందస్తు చర్యలు ప్రజలు పాటించాలని సూచించారు. అవసరం అయితే బయట తిరగరాదన, వృద్ధులు, పిల్లలు జాగ్రత్త వహించాలని సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈవార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈవార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 06:56 AM