Delhi Assembly: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోల రగడ.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజే హైడ్రామా
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:58 PM
అసెంబ్లీలో ఉద్రిక పరిస్థితులు తలెత్తడంతో స్పీకర్ వెంటనే జోక్యం చేసుకుని విపక్ష నేతలను మందలించారు. ఇది కర్టెసీ అడ్రెస్ అని, దీనిని రాజకీయ వేదక చేయవద్దని కోరారు.

న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక సోమవారం మొదలైన తొలి అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్ ఫోటోలను తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విపక్ష నేత అతిషి (Atishi) ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని అన్నారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అతిషికి మద్దతుగా విపక్ష సభ్యులు సైతం నిరసకు దిగడంతో ఉభయ పక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక
సభలో ఉద్రిక పరిస్థితులు తలెత్తడంతో స్పీకర్ విజేందర్ గుప్తా జోక్యం చేసుకుని విపక్ష నేతలను మందలించారు. ఇది కర్టెసీ అడ్రెస్ అని, దీనిని రాజకీయ వేదక చేయవద్దని కోరారు. సభ సజావుగా సాగాలని విపక్షాలు కోరుకోవడం లేదని, సభా కార్యక్రమాలను అడ్డుతగిలే ఉద్దేశంతో వచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. అధికార, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.
సీఎం స్పందనిదే..
సీఎం కార్యాలయం నుంచి అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగించారంటూ విపక్షం చేసిన ఆరోపణను ముఖ్యమంత్రి రేఖాగుప్తా తిప్పికొట్టారు. అంబేడ్కర్, భగత్ సింగ్‌ను అడ్డుపెట్టుకుని తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తు్న్నారంటూ ఆప్‌ను విమర్శించారు. ప్రభుత్వాధిపతుల ఫోటోలు పెట్టవద్దా? దేశ రాష్ట్రపతి ఫోటో ఉంచొద్దా? జాతిపిత గాంధీజీ ఫోటో పెట్టవద్దా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్, భగత్ సింగ్ ఎంతో గౌరవనీయులని, దేశానికి మార్గ నిర్దేశకులని అన్నారు. వారికి కూడా కార్యాలయంలో చోటు ఉంటుందన్నారు. ''ఈ గది (సీఎం కార్యాలయం) ఢిల్లీ సీఎం గది. వాళ్లకి సమాధానం చెప్పడం నా పని కాదు. నేను ప్రజలకు జవాబుదారీని'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.