Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:29 PM
డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు

డిబ్రూగఢ్: అసోం(Assam) చరిత్రలో తొలిసారి తూర్పు అసోంలోని డిబ్రూగఢ్‌లో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు జరిగాయి. ఖనికర్ పరేడ్ గ్రౌండ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఎగురవేశారు. డిబ్రూగఢ్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర రెండవ రాజధానికి రాబోయే మూడేళ్లలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని చెప్పారు.
Viral Video: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హెలికాప్టర్ల ప్రదర్శన చూశారా..
డిబ్రూగఢ్‌లో అసెంబ్లీ నిర్మాణం
ఏటా ఒక అసెంబ్లీ సమావేశం డిబ్రూగఢ్‌లో 2027 నుంచి జరుగుతుందని సీఎం శర్మ తెలిపారు. ఎగువ అసోంలోని బ్రహ్మపుత్ర ఒడ్డున శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం జరుపుతామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, రాబోయే మూడేళ్లలో ఇండియాలోనే కీలక నగరం డిబ్రూగఢ్ రూపొందుతుందని తెలిపారు. తేజ్‌పూర్‌లో రాజ్‌భవన్ నిర్మించి దానిని కల్చరల్ సిటీగా మారుస్తామి, సిల్చార్‌లో సెక్రటేరియట్, చీఫ్ సెక్రటరీ కార్యాలయం నిర్మిస్తామని చెప్పారు. దీంతో బారక్ వ్యాలీకి, గౌహతి మధ్య అంతరం తొలిగిపోతుందని తెలిపారు. డిబ్రూగఢ్‌తో తేజ్‌పూర్, సిల్చార్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..