YS Jagan: వైఎస్ జగన్‌ని ఫాలో అవుతానంటున్న అసోం సీఎం.. ఏ విషయంలో అంటే..?
ABN , Publish Date - Jan 27 , 2025 | 08:45 PM
CM Himanta biswa sarma And YS Jagan: అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారు.

గౌహతి, జనవరి 27: ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన ఆసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ని ఫాలో అవుతున్నారనే ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేళ.. అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. తమ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నారు. ఈ ప్రకటన.. ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎందుకంటే.. అటు హిమాలయాలు, ఇటు బ్రహ్మపుత్ర నదీ లోయ మధ్య సువిశాలంగా విస్తరించిన అసోంకు దిబ్రూగఢ్ రెండవ రాజధానిని చేస్తానని వెల్లడించారు. అందులోభాగంగా తేజ్‌పూర్‌లో మరో రాజ్‌భవన్, సిల్చార్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు చిన్న పాటి సెక్రటరియట్ నిర్మిస్తామని ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పష్టం చేశారు.
అందులోభాగంగా రానున్న మూడేళ్లలో దిబ్రూగఢ్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఇక తేజ్‌పూర్‌ను రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని వివరించారు. అయితే ఈ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. రాజధాని అమరావతికి మద్దతు తెలిపారు.
కానీ ఆయన అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో నిర్ణయం తీసుకున్నారు. అదీ కూడా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతి పరిపాలన, విశాఖపట్నం కార్యనిర్వాహణ, కర్నూలు న్యాయ రాజధానులుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోదాహరణగా వివరించారు. ఈ ప్రకటన అనంతరం ఆ సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికి తెలిసిందే. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతికి సంబంధించిన పనులు వాయు వేగంతో ఊపందుకొన్నాయి.
Also Read: లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు ఆ హక్కు: సీఎం సంచలన వ్యాఖ్యలు
అసోంకు మూడు కాదు .. 4 రాజధానులు..
ఈ రాష్ట్రంలో తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే అసోంకు దిస్‌పూర్ రాజధానిగా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్య విస్తరించి ఉంది. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా ఈ నగరమే అతి పెద్దది. అయితే ఈ రాష్ట్రంలో రాజధాని ఒక మూలకు విసిరేసినట్లు ఉంది. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతం నుంచి రాజధాని దిస్‌పూర్‌కి వెళ్లి రావాలంటే.. దాదాపు 24 గంటల పడుతోంది.
Also Read: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు
అలాగే అభివృద్ధి సైతం అంతగా కానరావడం లేదు. గౌహతి నగర పరిసర ప్రాంతాలు తప్ప రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలు అంతగా అభివృద్ధికి నోచుకోలేదన్నది సుస్పష్టం. దీనిని దృష్టిలో ఉంచుకొని.. సీఎం హేమంత బిశ్వ శర్మ.. మరో మూడు నగరాలను రాజధానులుగా ప్రకటించి.. ఆయా ప్రాంత ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అందులోభాగంగా దిబ్రూగఢ్‌ను రెండో రాజధానిగా చేస్తామన్నారు. ఈ నగరం ఎగువ అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన కొలువై ఉంది.
Also Read: కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..
దేశ రాజధాని న్యూఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులకు అనుసంధానించే క్రమంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే అస్సాంలో రాష్ట్ర రాజధాని గౌహతిని దాటుకుని దిబ్రూగఢ్ వరకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణం చేస్తుంది. అంటే పరోక్షంగా ఇప్పటికే ఆ నగరానికి రెండో రాజధానిగా గుర్తింపు నిచ్చే ప్రయత్నం చేశారనే ప్రచారం గతంలో జరిగింది.
Also Read: ప్రధాని మోదీకి పేద ప్రజల కంటే ‘వారే’ ముఖ్యం
అయితే ప్రస్తుతం తాజాగా సీఎం హేమంత బిశ్వ శర్మ.. ఆ నగరంలో శాశ్వత అసెంబ్లీ భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. 2027 నుంచి అసోం అసెంబ్లీ సమావేశాల్లో ఓ సెషన్ దిబ్రూగఢ్‌లో నిర్వహిస్తామని చెప్పారు. ఇక 2026, జనవరి 25వ తేదీ నుంచి నూతన అసెంబ్లీ భవనం నిర్మాణ పనులు ప్రారంభించి.. మూడు ఏళ్ల లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం బిశ్వ శర్మ వివరించారు.
Also Read: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు
అలాగే తేజ్‌పూర్‌ను అసోం సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. అక్కడ కూడా నూతన రాజ్ భవన్‌ను నిర్మిస్తామన్నారు. ఇది రాష్ట్రానికి మధ్య భాగంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన ఉందీ నగరం. అస్సాం రాష్ట్రాన్ని బ్రహ్మపుత్ర నది రెండుగా చీల్చుతుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతం దక్షిణాన ఉన్న ప్రాంతంతో పోల్చితే వెనుకబడి ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తర అస్సాంలో.. రాష్ట్రానికి సరిగ్గా మధ్య భాగంలో ఉన్న తేజ్‌పూర్‌ను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించడం ద్వారా ఆ ప్రాంత వాసుల మనసును సీఎం బిశ్వ శర్మ గెలుచుకోడానికే ఓ చర్చ అయితే కొనసాగుతోంది.
సిల్చార్ పట్టణం రాష్ట్ర రాజధానికి చాలా దూరంలో ఉంది. ఇంకా చెప్పాలంటే.. మణిపూర్‌కు సమీపంలో ఉంటుంది. సిల్చార్ చేరుకోవాలంటే మధ్యలో పర్వత శ్రేణులు దాటి బరాక్ లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు మినీ సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పాలనను మరింత చేరువ చేసినట్టవుతుందని సీఎం హేమంత బిశ్వ శర్మ భావిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా బరాక్ లోయకు గౌహతికి మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గౌహతితోపాటు దిబ్రూగఢ్, తేజ్‌పూర్, సిల్చార్ నగరాలు సైతం రాజధాని హోదాను దక్కించుకోనున్నాయి.
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మూడు రాజధానులున్నాయి. డెహ్రాడూన్ పాలనపరమైన రాజధాని కాగా.. నైనిటాల్‌లో మాత్రం హైకోర్టు కొలువై ఉంది. దీంతో నైనిటాల్‌ను జ్యుడీషియల్ క్యాపిటల్‌గా వ్యవహరిస్తారు. ఇక పర్వత ప్రాంతాల్లో గైర్‌సైన్ వద్ద కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాలను నిర్మించారు. ఈ పట్టణాన్ని వేసవి రాజధానిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అస్సాం ఏకంగా 4 నగరాలను రాజధానులుగా వ్యవహరించడం సరికొత్త చర్చకు దారితీసింది.
For For National News And Telugu News