Asaduddin Owaisi: పాక్ ఇప్పుడేమంటుంది, ట్రంప్‌కు నోబెల్ ఇద్దామా.. ఒవైసీ నిప్పులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:02 PM
పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఇరాన్‌తో ఇజ్రాయెల్‌కు జరుగుతున్న సంఘర్షణలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం వైమానికి దాడులు జరపడంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ సిఫారసు చేసిన పాక్ ఇప్పుడేమంటుంది? అంటూ నిలదీశారు. అమెరికా చేసిన తాజా ఘన కార్యానికి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటలకే అమెరికా నేరుగా ఇరాన్‌పై దాడులకు దిగింది.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన
ఇరాన్‌పై అమెరికా దాడులపై పాక్ వెంటనే స్పందించింది. మధ్యప్రాశ్చంలో ఉద్రిక్తతలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు జరిపారని, యూఎన్ చార్టర్ కింద తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు ఇరాన్‌కు ఉందని పేర్కొంది.
పాక్ యూ-టర్న్‌పై..
ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ పాక్ యూటర్న్ తీసుకోవడాన్ని ఒవైసీ నిలదీశారు. 'ఇంతటి ఘనకార్యం (ఇరాన్ అణుస్థావరాలపై దాడి) చేసిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కోరుకుంటోందా? ఇందుకోసమే వాళ్ల జనరల్ (పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునిర్) ట్రంప్‌తో డిన్నర్ తీసుకున్నారా?' అని ప్రశ్నించారు. ఇరాన్ వద్ద ఒక బోగీ నిండా అణ్వాయుధాలు ఉన్నాయని సృష్టించారని, ఇరాక్ విషయంలోనూ ఇదే జరిగిందని, కానీ అది నిరూపణ కాలేదని, లిబియా విషయంలోనూ ఇదే జరిగిందని, అక్కడ కూడా అణ్వాయుధాలున్నట్టు రుజువు కాలేదని ఒవైసీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..
For National News And Telugu News