Anand Mahindra: రియల్ హీరో మీరే.. మియావాకీ మ్యాన్‌కీ ఆనంద్ మహీంద్రా శాల్యూట్..
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:38 AM
Anand Mahindra RK NairTweet: ప్రత్యేక వ్యక్తులు, విశేషాలను ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఉంటారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన నాకు మియావాకీ ఫారెస్ట్ గురించి తెలుసు.. కానీ, రియల్ హీరో డాక్టర్ నాయర్ ఎవరో తెలియదు అంటూ ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు.

Anand Mahindra Praises Miyawaki Forest Creator: ప్రపంచంలో అతిపెద్ద మియావాకీ అడవి సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన ఆర్.కె.నాయర్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తారు. మియావాకీ అడవుల గురించి తెలిసినప్పటికీ, ఈ విధానాన్ని అమల్లో పెట్టి అద్భుత పర్యావరణ విజయం సాధించిన డాక్టర్ నాయర్ పేరు తెలియదని చెప్తూ, గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న విశాలమైన ఫారస్ట్ వీడియోను షేర్ చేశారు.
డాక్టర్ నాయర్ ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనంద్ మహీంద్రా తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. " నాకు మియావాకీ అడవి గురించి తెలుసు. కానీ, డాక్టర్ నాయర్ గురించి ఏమీ తెలియదు. ప్రపంచంలో అతిపెద్ద మియావాకీ అడవిని భారతదేశంలో ఎలా సృష్టించగలిగాడో అర్థం కావడం లేదు. యుఎస్ ప్రాధాన్యత జాబితా నుంచి పర్యావరణ అంశాన్ని తీసేసిన సమయంలో.. మనలో అలాంటి హీరోలు ఉన్నందుకు నేను గర్విస్తున్నాను" అని పేర్కొన్నారు. వైరల్ గా మారిన ఈ పోస్ట్ చూసి నెటిజన్లు డాక్టర్ నాయర్‌ను "ఇండియాస్ మియావాకీ మ్యాన్" అంటూ ప్రశంసిస్తున్నారు.
ఎవరీ ఆర్.కె.నాయర్?
డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త, ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. 2014లో 1500 చెట్లతో భారతదేశంలో మియావాకి ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా 100కి పైగా మియావాకి అడవులను సృష్టించాడు. ప్రజలు, పరిశ్రమలు, ప్రభుత్వాలు తన మిషన్‌లో భాగస్వాములు అయ్యేలా ప్రేరణ నింపాడు. 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా కచ్‌లో 470 ఎకరాల్లో సృష్టించిన స్మృతివన్ ఆయన సాధించిన అతిపెద్ద విజయం. ఇక్కడ 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటాలనేదే డాక్టర్ నాయర్ లక్ష్యం.
మియావాకీ ఫారెస్ట్ అంటే ఏమిటి?
జపాన్ కు చెందిన వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి వేగంగా అటవీ విస్తరణను పెంచేందుకు 1970లో మియావాకీ టెక్నిక్ కనిపెట్టారు. ఈ పద్ధతిలో వివిధ రకాల స్థానిక వృక్షజాతులను దగ్గర దగ్గరగా నాటుతారు. ఇలా చేయడం వల్ల సంప్రదాయ పద్ధతుల కంటే చెట్లు 10 రెట్లు వేగంతో దట్టంగా పెరుగుతాయి. ఇలాంటి అడవుల్లోని నేల కూడా చాలా సారవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Minister: చిక్కుల్లో రాష్ట్రమంత్రి.. ఆ వ్యాఖ్యలే ఆయన కొంపముంచనున్నాయా..