Parliament Monsoon Session: పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:46 PM
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక చర్యలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) చర్చలో పాల్గొంటూ, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో భద్రతా లోపాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలన్నారు. భత్రలా లోపాల నిందను లెఫ్టెనెంట్ గవర్నర్‌పై నెట్టేయండి సరికాదని పేర్కొన్నారు.
టెర్రరిస్టులను ఇంతవరకూ ఎందుకు పట్టుకోలేదు
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. 'మీ దగ్గర డ్రోన్లు, పెగాసస్‌లు, శాటిలైట్లు ఉన్నాయి. కానీ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయరు' అని నిలదీశారు.
పాక్ నుంచి ఎలా పహల్గాం చేరారు
ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనలో జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో విఫలమయ్యారని గొగోయ్ విమర్శించారు. అసలు ఉగ్రవాదులు ఎలా ఇండియాకు చేరుకున్నారు? బైసరాన్ ఎలా వచ్చారు? పర్యాటకులను వాళ్లు ఎలా చంపారు? అని ప్రశ్నించారు. ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి ఎలా ఇండియాలో ప్రవేశించారు, వారు ఉద్దేశం ఏమిటనేది దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు.
కాల్పుల విరమణపై ప్రధాని మాట్లాడాలి
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారత్ ఎందుకు అంగీకరించిందో రక్షణమంత్రి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు చెప్పాలని విపక్షాలు కోరుతున్నట్టు గొగోయ్ పేర్కొన్నారు. వాణిజ్య పరిణామాలు చూపించి ఇండియా, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు చెప్పారని, అసలు దీని వెనుక అసలు నిజం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందించకుండా ఐఎంఎఫ్‌ను ఎందుకు భారత్ అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పహల్గామ్ ఉగ్రవాదులు హతం..!
For More National News and Telugu News..