Amit Shah: గర్ల్ టాలెంట్‌కు ఫిదా అయిన అమిత్ షా.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:14 PM
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏడేళ్ల చిన్నారి ప్రతిభకు ముగ్ధుడైన ఆయన..

Amit Shah Mizoram Wonder Girl: ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇందులో భాగంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఏడేళ్ల బాలిక ఎస్తర్ లాల్దుహవ్మి హనమ్‌తే హృదయపూర్వకంగా వందేమాతరం గీతాన్ని ఆలపించింది. చిన్నారి గాయని ప్రతిభకు ముగ్ధుడైన హోం మంత్రి అప్పటికప్పుడే ఆమెను ప్రశంసలతో ముంచెత్తడమే కాదు. ఆమెకో ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కలిగిన అనుభూతిని పంచుకున్నారు.
ప్రత్యేక గిఫ్ట్ ఏంటంటే..
మిజోరాంకు చెందిన ఏడేళ్ల ఎస్తర్ అద్భుత గాత్రానికి ఫిదా అయిన హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు. ఈ క్షణాల్లో తనలో కలిగిన భావోద్వేగాలను ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ చేశారు. "భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ ఏకం చేస్తుంది. మిజోరాంకు చెందిన ఈ అద్భుతమైన చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనమ్‌తే ఐజ్వాల్‌లో పాడిన వందేమాతర గీతం విని నేను చాలా కదిలిపోయాను. 7 ఏళ్ల ఆ చిన్నారికి భారత మాత పట్ల ఉన్న ప్రేమ ఆమె పాటలో స్పష్టంగా కనిపించింది. ఆమె పాట వినడం నిజంగా అద్భుతమైన అనుభవం" అని రాశారు.
ఎవరీ మిజోరాం వండర్ కిడ్..
మిజోరాంకు చెందిన యువ గాయని ఎస్తర్ 2020లో తన ప్రతిభతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.'మా తుజే సలాం'అంటూ ఆమె పాడిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆమె స్వరంలోని మాధుర్యం, దేశభక్తిని మెచ్చుకోనివారు లేరు. వండర్ గర్ల్ బిరుదుతో పాటు విస్తృత గుర్తింపు, ప్రశంసలు సంపాదించుకున్న ఎస్తర్ గాత్రప్రతిభకు మిజోరాం ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు దక్కాయి. అప్పట్లో గవర్నర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందిన ఈ చిన్నారి తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హృదయాన్ని కూడా గెల్చుకుంది.
Read also : AR Rahman : ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్.. స్పందించిన కుమారుడు..
Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..
Ashwini Vaishnaw: తమిళం మధురమైన భాష... మన దేశ ఆస్తి, ప్రపంచ ఆస్తి కూడా