Pahalgam Attack: రాష్ట్రపతితో షా, జైశంకర్ భేటీ
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:41 AM
పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు, ప్రతిగా పాక్ విధించిన ఆంక్షల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వారు రాష్ట్రపతికి వివరాలు అందించారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు.. దానికి ప్రతిగా పాక్ ప్రతి ఆంక్షల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను ఇరువురు మంత్రులు ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అదే సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జీ-20 దేశాల్లో ఎంపిక చేసిన దేశాల రాయబారులతో సమావేశం నిర్వహించింది.
అత్యంత హేయమైన చర్య: ట్రంప్
పహల్గాంలో నిస్సహాయులైన పర్యాటకులపై జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని పట్టుకోవడంలో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో మద్దతిస్తామన్నారు. గురువారం ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ ఘటన అత్యంత హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు.
నేడు కశ్మీర్‌కు ఆర్మీ చీఫ్
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం కశ్మీర్‌లో పర్యటించనున్నారు. శ్రీనగర్‌లో ఆయన ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రత, నిఘాను ముమ్మరం చేయడం, అట్టారీ క్రాసింగ్ వద్ద తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తారు.
కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్
భారత్ ఆంక్షల నేపథ్యంలో గురువారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలింది. కరాచీ-100 ఇండెక్స్ 2,565 పాయింట్ల మేర నష్టపోయింది.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్