Share News

Air India: విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు

ABN , Publish Date - Jul 24 , 2025 | 07:51 PM

విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.

Air India:  విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు
Air India pilots

న్యూఢిల్లీ జూలై 24: జూన్ 12న విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. ఈ విషయాన్ని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహొల్ చెప్పారు. జూన్ 16న ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో మొత్తం 112 మంది పైలట్లు అనారోగ్యానికి గురైనట్లు నివేదించారని తెలిపారు. ఇందులో 51 మంది కమాండర్లు, 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిలో సామూహిక సిక్ లీవ్ లకు సంబంధించి ఎంపీ జై ప్రకాష్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు.

ఇక, విమాన సిబ్బంది మానసిక ఆరోగ్యం గురించి లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా మంత్రి.. విమాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్లకు (ATCOలు) మానసిక ఆరోగ్య సౌకర్యాలపై వివరణ ఇచ్చారు. దీనిపై తగిన వివరణాత్మక మార్గదర్శకాలతో ఫిబ్రవరి 2023లో 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక సర్క్యులర్ జారీ చేసిందని మంత్రి చెప్పారు. వీటిలో.. సాధారణ వైద్య పరీక్షల సమయంలో DGCA-ఆమోదించిన వైద్య పరీక్షకుల ద్వారా సులభమైన, సత్వర మానసిక ఆరోగ్య తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. సిబ్బంది,ఇంకా ATCOల మానసిక ఆరోగ్య సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి సహాయపడే ప్రత్యేక శిక్షణ మాడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు.


అంతకుముందు, జూలై 12న, జరిగిన విమాన ప్రమాద దర్యాప్తు గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో మొదటిసారి జరిగిందని అన్నారు. రాజ్యసభను ఉద్దేశించి కేంద్ర మంత్రి నాయుడు మాట్లాడుతూ, 'మొదటి సెట్ దర్యాప్తు పూర్తయింది. ప్రాథమిక నివేదిక విడుదలైంది. గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, బ్లాక్ బాక్స్‌ను డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.' అని కేంద్రమంత్రి చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)ని ప్రశంసిస్తూ ఆయన, ఏజెన్సీ నిష్పాక్షికంగా ముందుకెళ్తుందని తెలిపారు.


Also Read:

ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!

పాత బట్టలు పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

For More Lifestyle News

Updated Date - Jul 24 , 2025 | 07:51 PM