Caste Census Survey: రేవంత్ సర్కార్‌పై రాహుల్ ప్రశంసలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 07:11 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కుల గణన స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వచ్చినట్లు గుర్తు చేశారు.

న్యూఢిల్లీ, జులై 24: రేవంత్ రెడ్డి సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణలో కుల గణనను ప్రభుత్వం స్ఫూర్తిదాయకంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణలో కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో కుల గణన సర్వే చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
55 ప్రశ్నలతో క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఈ కుల గణన చేపట్టారని రాహుల్ వివరించారు. విజయవంతంగా కుల గణన నిర్వహించడమంటే అంత ఈజీ కాదన్నారు. రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని కితాబు ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని రాహుల్ అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.