Air India: సమస్యలేవీ లేవు, ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ పై తనిఖీలు ముగించిన ఎయిర్ ఇండియా
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:52 PM
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..

న్యూఢిల్లీ, జూలై 22: తమ అన్ని బోయింగ్ 787, 737 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్ (FCS) లాకింగ్ మెకానిజంపై తనిఖీలు పూర్తయ్యాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ తనిఖీలలో ఎలాంటి సమస్యలు లేవని తేలిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా తన దగ్గరున్న అన్ని బోయింగ్ ఫ్లైట్లలో ఇందన స్విచ్ మెకానిజం మీద ముందు జాగ్రత్తగా తనఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎయిర్ ఇండియా జూలై 12న స్వచ్ఛందంగా తమ బోయింగ్ విమానాల్లో తనిఖీలను ప్రారంభించి, DGCA నిర్దేశించిన నిర్ణీత కాలపరిమితిలోపు వాటిని పూర్తి చేసింది. ఇదే విషయాన్ని నియంత్రణ సంస్థకు కూడా తెలియజేశామని ఎఇ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, గత నెల అహ్మదాబాద్‌లో కూలిపోయిన AI171 విమానానికి సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిర్ ఇండియా నివేదికలలో ఎటువంటి దోషాలు కనిపించలేదని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ నిన్న పార్లమెంటుకు తెలియజేశారు. రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాసిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ ప్రకటన చేశారు.
ఇలా ఉండగా, జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై ఒక్కరు మినహా మిగిలిన 241 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం మెడికల్ హాస్టల్ బిల్డింగ్ మీద కూలడంతో 19 మంది విగతజీవులయ్యారు. ఇలా మొత్తంగా 260 మంది మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
For More AP News and Telugu News