Share News

Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖడ్ వారసుడెవరు

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:09 PM

బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయేకు ఇటు లోక్‌సభలోనే కాకుండా అటు రాజ్యసభలోనూ మెజారిటీ సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ రాజీనామాకు ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖడ్ వారసుడెవరు
Jagdeep Dhankhar

న్యూఢిల్లీ: జగదీప్ ధనఖడ్ (Jagdeep Dhankhar) ఆకస్మిక రాజీనామాతో ఆయన వారసుడుగా ఎవరనే చర్చ మొదలైంది. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు తన రాజీనామా లేఖలో ధన్‌ఖడ్ వివరించడంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారంనాడు ఆమోదించారు. కీలకమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఈ సమావేశాల్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక చేపడతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.


బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయేకు ఇటు లోక్‌సభలోనే కాకుండా అటు రాజ్యసభలోనూ మెజారిటీ సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ రాజీనామాకు ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో ఆయన వారసుడెవరనే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టక మందు ధన్‌ఖడ్ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా పని చేశారు. ఆ ప్రకారం ఈసారి కూడా ఒక గవర్నర్‌ను కానీ, కేంద్ర మంత్రుల్లో ఒకరిని కానీ, అందరికీ ఆమోదయోగ్యమైన ఆర్గనైజేషన్ నేతను కానీ బీజేపీ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ధన్‌ఖడ్‌కు ముందు మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారు. 2017 నుండి 2022 వరకూ భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.


వెటరన్ నేతకే...రేసులో హరివంశ్

ఉప రాష్ట్రపతి పదవికి ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన ఈ పదవిని సీనియర్ నేతకే అప్పగించవచ్చని అన్నారు. కాగా, జనతాదళ్ (యునైటెడ్) ఎంపీగా ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఈ కీలక పదవి అప్పగించే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు.


ఇది కూడా చదవండి..

జగదీప్ రాజీనామాకు ఆమోదం.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..

మరణ శిక్ష నుంచి తప్పించుకున్న నిమిష..! త్వరలో విడుదల..?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 04:30 PM