Share News

Jagdeep Resignation Behind: ఉపరాష్ట్రపతి జగదీప్ రాజీనామాకు వెనుక.. ఏం జరిగిందో మీకు తెలుసా

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:15 PM

గత రాత్రి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి 10 రోజుల ముందు 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తానని చెప్పి, ఆకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

Jagdeep Resignation Behind: ఉపరాష్ట్రపతి జగదీప్ రాజీనామాకు వెనుక.. ఏం జరిగిందో మీకు తెలుసా
Jagdeep Resignation Behind

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) గత రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో జరిగిన కొన్ని సంఘటనలు (Jagdeep Resignation Behind) ఉన్నాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


కేంద్రంతో విభేదాలు

ఈ సంఘటన తర్వాత ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిసింది. ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అయితే, ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా, ధన్‌ఖర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. గత రాత్రి 9:25 గంటలకు ఉప రాష్ట్రపతి అధికారిక X ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పోస్ట్ చేశారు.


సపోర్ట్ చేసిన వారికి..

తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో తన పదవీ కాలంలో సపోర్ట్ చేసిన, సహకారం అందించిన వారికి ధన్‌ఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దీనికి ముందు సంచలన ప్రకటన..

జూలై 10న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ నిర్ణయానికి లోబడి, 2027 ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుని పదవీ విరమణ చేస్తా అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఈ క్రమంలోనే ధన్‌ఖడ్‌ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసి అనేక మందికి షాక్ ఇచ్చారు. దీంతో ఈ రాజీనామా గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి

అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 02:55 PM