Aviation Minister Rammohan: అహ్మదాబాద్ ప్రమాదంపై ఏఏఐబీ చెప్పిందే ఫైనల్
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:01 AM
పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ దేశాల

పశ్చిమ దేశాల మీడియా సంస్థలకు రామ్మోహన్ సూచన
న్యూఢిల్లీ, జూలై 20: పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ దేశాల(అమెరికా, ఐరోపా) వార్తా సంస్థలు కథనాలను ప్రసారం చేయడాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన వార్తా కథనాలను ప్రసారం చేయవద్దని సూచించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం(ఏఏఐబీ)పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఏఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రాకూడదని పేర్కొన్నారు. ‘‘విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ చెప్పిందే ఫైనల్’’ అని స్పష్టం చేశారు. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను ఇప్పటికే బహిర్గతం చేసిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ‘‘గతంలో బ్లాక్‌బాక్సులో ఏముందో తెలుసుకోవడానికి విదేశాలకు పంపాల్సి వచ్చేది. మొదటిసారిగా ఇండియాలోనే దాన్ని ఏఏఐబీ డీకోడ్ చేసింది’’ అని ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News