Share News

F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత బ్రిటిష్ ఎఫ్-35బి తిరుగుప్రయాణం

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:54 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఇది. దీని ఖరీదు దాదాపు 110 మిలియన్ డాలర్లు. భారత్‌తో కలిసి యుద్ధ విన్యాసాలతో పాల్గొన్న ఈ విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా జూన్ 14న అత్యవసరంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత బ్రిటిష్ ఎఫ్-35బి తిరుగుప్రయాణం
F-35 Fighter Jet

తిరువనంతపురం: సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానం (F-35B Fighter Jet) ఎట్టకేలకు 37 రోజుల తర్వాత స్వదేశానికి పయనమవుతోంది. ఈనెల 22న కేరళ నుంచి యూకేకి ప్రయాణం సాగించినున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


'విమానం మరమ్మతులు పూర్తికావడంతో హ్యాంగర్ నుంచి బయటకు తీసుకు వస్తున్నాం. మంగళవారంనాడు తిరిగి యూకేకు బయలుదేరుతుంది' అని అధికారి ఒకరు చెప్పారు. అయితే ఏ సమయానికి బయలుదేరుతుందనేది వెల్లడించలేదు.


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఇది. దీని ఖరీదు దాదాపు 110 మిలియన్ డాలర్లు. భారత్‌తో కలిసి యుద్ధ విన్యాసాలతో పాల్గొన్న ఈ విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా జూన్ 14న అత్యవసరంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. తొలుత చిన్న టీమ్‌తో యూకే నుంచి నిపుణులు వచ్చినప్పటికీ మరమ్మతు పనులు పూర్తి కాలేదు. దీంతో ఈనెల 6న బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ400ఎం అట్లాస్‌లో 25 మంది బ్రిటిష్ ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంది. ఎట్టకేలకు ఎయిరిండియా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) హ్యాంగర్‌లలో విజయవంతంగా మరమ్మతులు పూర్తి చేసారు. సోమవారంనాడు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అనంతరం విమానం యూకే బయలుదేరుతుందని, మెయింటెనెన్స్ కోసం తెచ్చిన సామగ్రి, సిబ్బంది మరో విమానంలో బయలుదేరుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

రన్‌వే దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఏం జరిగిందంటే?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 06:58 PM