Share News

Tungabhadra: తుంగభద్ర నుంచి అదనపు జలాల విడుదల

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:27 PM

తుంగభద్ర(Tungabhadra) నుంచి హెచ్చెల్సీ ఆయకట్టులో సాగులో ఉన్న పంటలకు, ప్రజల తాగునీరు అవసరం నిమిత్తం 70 క్యూసెక్కుల నీరును బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు.

Tungabhadra: తుంగభద్ర నుంచి అదనపు జలాల విడుదల

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) నుంచి హెచ్చెల్సీ ఆయకట్టులో సాగులో ఉన్న పంటలకు, ప్రజల తాగునీరు అవసరం నిమిత్తం 70 క్యూసెక్కుల నీరును బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. సిరువార, సంగనకల్లు, చాగనూరు, హద్దినగుండు, టి. బూదిహళ్లు. కప్పగల్లు, ప్రాంతాల్లో వివిద రకాల పంటలు కోత దశలో ఉన్నాయి. ఈ గ్రామాలకు తాగునీరు సైతం చాలా అవసరం. ముందు బోర్డు నీటి కేటాయింపు ప్రకారం కోటా ముగిసింది.

ఈ వార్తను కూడా చదవండి: Veerappan: వీరప్పన్‌ బంధువు మృతిపై అనుమానం..


డ్యాం నుంచి కాలువకు నీరు బంద్‌ చేశారు. అదనంగా మరోమారు నీరు విడుదల చేశారు. నీరు విడుదల చేయించడంతో మాజీ మంత్రి నాగేంద్ర(Former Minister Nagendra) తీవ్రంగా కృషి చేసినట్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్ర ముఖ్యమంత్రి, డీసీఎం, అలాగే నీరావరి అధికారులతో కలిసి నీరు విడుదుల చేయకుంటే రైతులు నష్టపోతారని వివరించారు.


pandu1.2.jpg

ఆయన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన అధికారులు నీరు విడుదల చేశారు. నీటి రాకతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులు గోవర్దన్‌రెడ్డి, అన్న నాగరాజు, మాట్లాడుతూ తుంగభద్ర ఎగవ కాలువ కింద పంటలు కొన్ని సాగులో ఉన్నాయని, ఇలాంటి దశలో నీరు వదలడం హర్షణీయమన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 12:27 PM